NEET UG: నీట్ యూజీ కౌన్సెలింగ్ ఫస్ట్ రౌండ్ ఫలితాలు విడుదల
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన నీట్ (UG) తొలి విడత కౌన్సెలింగ్ ఫలితాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ప్రకటించింది. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయించబడ్డాయి.

సీటు పొందిన వారు ఆగస్టు 14 నుంచి సంబంధిత మెడికల్ కళాశాల లేదా సంస్థలో రిపోర్టింగ్ చేయవచ్చు. రిపోర్టింగ్‌కు ముందు MCC అధికారిక వెబ్‌సైట్ నుంచి అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అభ్యర్థులు ధ్రువీకరణ కోసం అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఫోటోకాపీలు తీసుకురావాలి. గడువు తీరిన తర్వాత ఎలాంటి క్లెయిమ్‌లు స్వీకరించరని MCC స్పష్టం చేసింది. తాజా అప్‌డేట్స్ కోసం ఎప్పటికప్పుడు నీట్ యూజీ కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించింది.