Government Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త.. జూన్ 2025లో అప్లై చేయాల్సిన ముఖ్యమైన ఉద్యోగాల జాబితా ఇదే!
జూన్ 2025లో అప్లై చేయాల్సిన రైల్వే, UPSC, నేవీ, CISF, NEEPCO ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, అర్హతలు, చివరి తేదీలు.
Government Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త.. జూన్ 2025లో అప్లై చేయాల్సిన ముఖ్యమైన ఉద్యోగాల జాబితా ఇదే!
Government Jobs: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మీ అందరికీ ఒక శుభవార్త! జూన్ 2025లో మీరు అప్లై చేయగల కొన్ని ముఖ్యమైన ఉద్యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన ఉద్యోగాల జాబితా
ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే వివిధ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేశాయి. కాబట్టి 2025 జూన్‌లో అప్లై చేయాల్సిన ఉద్యోగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రైల్వే జాబ్స్:
IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో జాయింట్ జనరల్ మేనేజర్/సివిల్, డిప్యూటీ జనరల్ మేనేజర్/సివిల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి.
సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి ఇది ఒక మంచి అవకాశం.
చివరి తేదీ: 2025 జూన్ 20.
అర్హత: AICTE గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి కనీసం 60% మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: మే 1, 2025 నాటికి గరిష్టంగా 33 సంవత్సరాలు ఉండాలి.
అనుభవం: కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు ఉంటుంది. అంతేకాకుండా అలవెన్సులు కూడా ఉంటాయి.
మరింత సమాచారం కోసం IRCON అధికారిక వెబ్‌సైట్ ircon.org ని సందర్శించండి.
UPSC రిక్రూట్‌మెంట్:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) లీగల్ ఆఫీసర్, ఆపరేషన్స్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్ ఇంకా 493 ఇతర పోస్టులను ఆఫర్ చేస్తోంది.
డిగ్రీ మరియు స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ: 2025 జూన్ 12.
అర్హత: పోస్టును బట్టి బి.ఎస్సీ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతలు ఉండాలి.
మరింత సమాచారం కోసం UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ని సందర్శించండి.
నేవీలో సెయిలర్ ఉద్యోగాలు:
ఇండియన్ నేవీ డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్, చీఫ్ పెట్టీ ఆఫీసర్ ఇంకా సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారతదేశంలోని నావల్ బేసిస్‌లో ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.
చివరి తేదీ: 2025 జూన్ 17.
వయసు: జూన్ 17, 2025 నాటికి 17 ½ నుంచి 25 సంవత్సరాలు ఉండాలి.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 లేదా సమానమైన కోర్సు చదివి ఉండాలి. అంతేకాకుండా అథ్లెటిక్స్, బాక్సింగ్, స్విమ్మింగ్, క్రికెట్, ఫుట్‌బాల్ మొదలైన విభాగాలలో అంతర్జాతీయ, జాతీయ లేదా రాష్ట్ర స్థాయిలో గెలిచిన సర్టిఫికెట్స్ ఉండాలి.
మరింత సమాచారం కోసం ఇండియన్ నేవీ కెరీర్ వెబ్‌సైట్ joinindiannavy.gov.in ని సందర్శించండి.
CISFలో హెడ్ కానిస్టేబుల్ (స్పోర్ట్స్ కోటా):
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) స్పోర్ట్స్ కోటా కింద 403 హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేస్తోంది.
ఫిజికల్ ఫిట్‌నెస్ మరియు డిసిప్లైన్ ఉన్న క్రీడాకారులు అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ: 2025 జూన్ 6.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా వుషు, కరాటే, ఆర్చరీ, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, ఫెన్సింగ్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, జూడో, కబడ్డీ, షూటింగ్, బాడీబిల్డింగ్ వంటి 29 గుర్తింపు పొందిన క్రీడలలో దేనిలోనైనా రాష్ట్ర, జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
వయసు: ఆగస్టు 1, 2025 నాటికి 18 నుండి 23 సంవత్సరాలు ఉండాలి.
జీతం: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు ఉంటుంది. అంతేకాకుండా అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
మరింత సమాచారం కోసం cisfrectt.cisf.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
NEEPCOలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ:
నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NEEPCO) ఫైనాన్స్ మరియు హిందీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫైనాన్స్ లేదా హిందీ భాషా నైపుణ్యాలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
మరింత సమాచారం కోసం recruitment.neepco-spark.co.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఈ ఉద్యోగాలన్నీ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీ భవిష్యత్తు కోసం ఆల్ ది బెస్ట్!