Job Mela:ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా..పూర్తి వివరాలివే

Update: 2025-01-26 02:38 GMT

Job Mela: నిరుద్యోగులకు శుభవార్త. ఈనెల 28వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఉద్యోగమేళాను నిర్వహించనున్నారు. మొత్తం 125 ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన వారు ధ్రువపత్రాలతో ఈ మేళాకు హాజరవ్వాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం 7799884909ను సంప్రదించవచ్చు.

ఈ ఉద్యోగమేళాలో మొత్తం 125పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. దీనిలో మెకానిక్ ఉద్యోగాలు 25 ఉండగా సర్వీస్ అడ్వైజర్స్ ఖాళీలు 50 పోస్టులు ఉన్నాయి. రిలేషన్ షిప్ మేనేజర్ ఖాళీలు కూడా మరో 50 వరకు ఉన్నాయి. మెకానిక్ ఉద్యోగాలకు ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సర్వీస్ అడ్వజైర్స్ కు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఎంపికైనవారికి రూ. 11వేల నుంచి 20వేల వరకు జీతం చెల్లించాల్సి ఉంటుంది. వీరంతా కూడా హైదరాబాద్ వేదికగా పనిచేయాలి.

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో మిత్రా ఏజెన్సీస్ ఆధ్వర్యంలో ఈజాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న యూనివర్సిటీ ఎంప్లాయ్ మెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ మేళాను నిర్వహిస్తున్నారు. దరఖాస్తుదారులు 18 నుంచి 35ఏళ్లలోపు గలవారు ఉండాలి. ఈ మేళాకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 7799884909ను సంప్రదించవచ్చు.

Tags:    

Similar News