ITI Diploma Course: త్వరగా ఉద్యోగం సాధించాలంటే ఐటీఐ బెస్ట్‌కోర్సు..10th, 12th తర్వాత కూడా చేయొచ్చు..!

ITI Diploma Course: మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు.

Update: 2024-03-29 14:30 GMT

ITI Diploma Course: త్వరగా ఉద్యోగం సాధించాలంటే ఐటీఐ బెస్ట్‌కోర్సు..10th, 12th తర్వాత కూడా చేయొచ్చు..!

ITI Diploma Course: మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. చాలా మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. కొంతమంది కుటుంబ కారణాల వల్ల త్వరగా ఉద్యోగం పొందాలని కోరుకుంటారు.ఈ పరిస్థితిలో అభ్యర్థులకు ఐటీఐ డిప్లొమా కోర్సు చేయడం ఉత్తమ ఎంపిక. ఐటీఐ చదివిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. ఐటీఐ తర్వాత రైల్వే, ఆర్మీ సహా అనేక ప్రభుత్వ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రైవేట్ రంగంలో కూడా సులభంగా మంచి ఉద్యోగం పొందవచ్చు.

ఈ కంపెనీల్లో ఉద్యోగాలు

ఆర్మీ, రైల్వేలతో సహా అనేక ప్రభుత్వ సంస్థల్లో ఐటీఐ చేసినవారికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇందుకోసం సంబంధిత స్ట్రీమ్‌లో ఐటీఐ డిప్లొమాతో పాటు పది లేదా పన్నెండో తరగతి చదివి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ కంపెనీల్లోనూ ఐటీఐ డిప్లొమా హోల్డర్లకు మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రారంభంలో తక్కువ జీతం పొందవచ్చు కానీ అనుభవం, పని ఆధారంగా మంచి వృద్ధిని సాధిస్తారు.

ఐటీఐలో ప్రవేశం ఎలా..?

ఏ రాష్ట్రంలోనైనా ప్రతి జిల్లాలో ఐటీఐ ఇన్‌స్టిట్యూట్‌లు ఉంటాయి. మీరు 10 లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైతే ఇక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇందుకోసం అప్లై చేసుకోవాలి. మీరు ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్ నుంచి కూడా ఈ కోర్సు చేయవచ్చు. అయితే ప్రభుత్వ సంస్థల్లో ఈ కోర్కు తక్కువ ఫీజులు ఉంటాయి. ఐటీఐలో అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఏదైనా ఒక ట్రేడ్‌ని ఎంచుకోవాలి. ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లో అన్ని ట్రేడ్‌లు అందుబాటులో ఉండనవసరం లేదు. అందుకే మీరుచేసే ట్రేడ్‌ గురించి సమాచారాన్ని పొందండి. తర్వాత అందులో చేరిపోండి.

Tags:    

Similar News