Indian Students: భారతీయ విద్యార్థులకు బిగ్‌ షాక్.. హెచ్-1బీ వీసాపై కీలక అప్‌డేట్!

Indian Students: ఈ ప్రోగ్రామ్‌ వలన అమెరికన్ ఉద్యోగులకే నష్టమని వాదన వినిపిస్తోంది. గత సంవత్సరం మొత్తం 5.4 లక్షల మంది విదేశీయులు OPT, STEM OPT, CPT ప్రోగ్రాముల కింద పనిచేశారు.

Update: 2025-04-10 15:39 GMT

Indian Students: భారతీయ విద్యార్థులకు బిగ్‌ షాక్.. హెచ్-1బీ వీసాపై కీలక అప్‌డేట్!

Indian Students: అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థుల్లో లక్ష మందికి పైగా భవిష్యత్తు ఇప్పుడు గందరగోళంలో ఉంది. ఇందుకు కారణం OPT అనే వర్క్ వీసా ప్రోగ్రాం ముగింపు కోసం అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన కొత్త బిల్లే. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఎఫ్-1 వీసాతో చదువుతున్న స్టూడెంట్లు తమ కోర్సు పూర్తయ్యాక మూడు సంవత్సరాల పాటు పనిచేసే అవకాశం పొందుతారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతోంది.

ఈ బిల్‌ అనుమతించబడితే, విద్యార్థులు తప్పనిసరిగా హెచ్-1బీ వీసా పొందాల్సి ఉంటుంది. అయితే హెచ్-1బీ వీసా చాలా కాంపిటీటివ్, సంవత్సరానికి పరిమిత సంఖ్యలో మాత్రమే ఇస్తారు. అంతేకాదు, ఇటీవలి కాలంలో ట్రంప్ పాలనకింద వీసాలపై నిఘా ఎక్కువైంది. చిన్న చిన్న తప్పులకే వీసాలు రద్దు చేస్తున్నారని సమాచారం.

OPT ప్రోగ్రామ్‌ను తొలిసారి 1947లో ప్రవేశపెట్టారు. తరువాత బుష్‌, ఒబామా పాలనలలో దీనిని సవరించి STEM స్టూడెంట్లకు 36 నెలల వరకు విస్తరించారు. అమెరికాలోని స్టాన్ఫర్డ్, కాలిఫోర్నియా, కొలంబియా వంటి ప్రముఖ యూనివర్సిటీల్లో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంది. వారిలో చాలా మంది ఇప్పుడు OPT ఆధారంగా అమెరికాలో పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రద్దయ్యే అవకాశాలు కలవరానికి దారితీస్తున్నాయి.

2025లో ట్రంప్ మళ్లీ అధికారంలోకి రావడంతో వలస విధానాల్లో కఠినతరం కనిపిస్తోంది. మరొకవైపు ఇండియన్-అమెరికన్ ఎంపీ శ్రీ థానేదార్ గత సంవత్సరం STEM గ్రాడ్యుయేట్లకు సౌలభ్యంగా అమెరికాలో ఉండేలా కొత్త బిల్ ప్రవేశపెట్టినప్పటికీ, ప్రస్తుతం పార్లమెంట్‌లో చర్చలో ఉన్న కొత్త బిల్ పూర్తి భిన్న దిశలో ఉంది.

జనవరి 2025లో హౌస్ జుడీషియరీ కమిటీలో జరిగిన సమావేశంలో, OPT ప్రోగ్రామ్‌పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. డిప్లొమా మిల్స్ వంటి వ్యవస్థలు దీనిని దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ ప్రోగ్రామ్‌ వలన అమెరికన్ ఉద్యోగులకే నష్టమని వాదన వినిపిస్తోంది. గత సంవత్సరం మొత్తం 5.4 లక్షల మంది విదేశీయులు OPT, STEM OPT, CPT ప్రోగ్రాముల కింద పనిచేశారు.

Tags:    

Similar News