ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు

ఈపీఎఫ్ఓ 3 కింద పీఎఫ్ సభ్యులకు ఏటీఎం కార్డులు అందిస్తారు. అత్యవసర సమయాల్లో పీఎఫ్ డబ్బులు ఉపయోగించుకోవచ్చు.

Update: 2025-01-31 14:00 GMT

ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు

EPFO To Enable from ATM withdrawals for provident Fund

ఏటీఎంల నుంచి పీఎఫ్ డబ్బులను డ్రా చేసుకోవచ్చ. దీని కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకువస్తోంది. 2025 జూన్ నుంచి ఈ పాలసీని అమల్లోకి తీసుకురానున్నారు. దీని కోసం ఈపీఎఫ్ఓ కొత్త సాప్ట్ వేర్ సిస్టమ్ EPFO 3.0 ను ప్రారంభించనున్నారు.ఈపీఎఫ్ఓ 3 కింద పీఎఫ్ సభ్యులకు ఏటీఎం కార్డులు అందిస్తారు. అత్యవసర సమయాల్లో పీఎఫ్ డబ్బులు ఉపయోగించుకునేందుకు ఈ ఏటీఎం కార్డులు ఉపయోగపడుతాయి.దీనికి సంబంధించి వెబ్ సైట్ ను డెవలప్ చేయనున్నారు.

సాధారణ బ్యాంకు ఏటీఎం తరహాలోనే పీఎఫ్ సభ్యులకు ఏటీఎం కార్డులను జారీ చేయనున్నారు. దీనికి సంబంధించిన సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ చేస్తున్నారు.పీఎఫ్ ఖాతాను పీఎఫ్ సభ్యుడి బ్యాంకు ఖాతాను లింక్ చేయాలి. ఉద్యోగం లేని సమయంలోనూ మెడికల్ ఎమర్జెన్సీకి పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణం కోసం పీఎఫ్ లో కొంత డబ్బును డ్రా చేసుకోవచ్చు.

ఏటీఎం కార్డుతో పాటు మొబైల్ యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈపీఎఫ్ఓ 3 కింద కొత్త మొబైల్ అప్లికేషన్, ఇతర డిజిటల్ సేవలను ప్రారంభించనుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం అమలు చేస్తున్న 12 శాతం కంట్రిబ్యూషన్ పరిమితిని కూడా ఎత్తివేయాలని కేంద్ర కార్మిక శాఖ భావిస్తోంది. ఉద్యోగులు తమ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పీఎఫ్ లో డబ్బులు దాచుకోనేలా ప్లాన్‌లలో మార్పులు చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News