EPFO Recruitment 2023: నిరుద్యోగులకి శుభవార్త.. డిగ్రీ అర్హతతో ఈపీఎఫ్‌లో 2,674 ఉద్యోగాలు..!

EPFO Recruitment 2023: డిగ్రీ, ఇంటర్‌ చదివిన నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి.

Update: 2023-03-26 04:33 GMT

EPFO Recruitment 2023: నిరుద్యోగులకి శుభవార్త.. డిగ్రీ అర్హతతో ఈపీఎఫ్‌లో 2,674 ఉద్యోగాలు..!

EPFO Recruitment 2023: డిగ్రీ, ఇంటర్‌ చదివిన నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పాలి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (SSA), స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 27 మార్చి 2023 నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి అర్హత గల అభ్యర్తులు EPFO అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. ఇందులో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు, 185 స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ 26 ఏప్రిల్ 2023గా నిర్ణయించారు. నోటిఫికేషన్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (SSA) ఖాళీల వివరాలు

- అన్‌రిజర్వ్‌డ్ - 999 పోస్ట్‌లు

- SC - 359

- ST - 273

- OBC - 514

- EWS - 529

స్టెనోగ్రాఫర్ ఖాళీల వివరాలు

- UR - 74 పోస్ట్‌లు

- SC - 28

- ST - 14

- OBC - 50

- EWS - 19

విద్యా అర్హత

1. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (SSA) - ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇది కాకుండా అతని టైపింగ్ వేగం ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు, హిందీలో నిమిషానికి 30 పదాలు ఉండాలి.

2. స్టెనోగ్రాఫర్ - ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇది కాకుండా, డిక్టేషన్ - 10 నిమిషాల్లో నిమిషానికి 80 పదాలు, ట్రాన్స్‌క్రిప్షన్ 50 నిమిషాలు (ఇంగ్లీష్), 65 నిమిషాలు (హిందీ) ఉండాలి.

గరిష్ట వయో పరిమితి

రెండు పోస్టులకు గరిష్ట వయోపరిమితి ఒకే విధంగా ఉంటుంది. రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము

రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 700 చెల్లించాలి. అయితే రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

జీతభత్యాలు

1. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (SSA) - ఈ పోస్ట్‌కి ఎంపికైన అభ్యర్థి లెవల్ 5 కింద రూ. 29,200 నుంచి 92,300 వరకు పే స్కేల్ పొందుతారు.

2. స్టెనోగ్రాఫర్ - స్టెనోగ్రాఫర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి లెవల్ 4 కింద రూ. 25,500 నుంచి 81,100 పే స్కేల్ చెల్లిస్తారు.

Tags:    

Similar News