Interview Tips: ఇంటర్వూకి వెళ్లేముందు టెన్షన్‌కు గురవుతున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

Interview Tips: ఉద్యోగం కోసం ఏదైనా కంపెనీకి ఇంటర్వూకి వెళ్లినప్పుడు చాలామంది విపరీతమైన టెన్షన్‌కు గురవుతారు.

Update: 2024-02-24 16:00 GMT

Interview Tips: ఇంటర్వూకి వెళ్లేముందు టెన్షన్‌కు గురవుతున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

Interview Tips: ఉద్యోగం కోసం ఏదైనా కంపెనీకి ఇంటర్వూకి వెళ్లినప్పుడు చాలామంది విపరీతమైన టెన్షన్‌కు గురవుతారు. సాధారణంగా ఇది అందరూ ఎదుర్కొనే పరిస్థితే. కానీ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఇంటర్వూను సులభంగా సక్సెస్‌ చేసుకోవచ్చు. ముందుగా మన మనుసలోకి ఎలాంటి ప్రశ్నలు, సందేహాలు రానియవద్దు. హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌ వారు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే భయం ఉండొద్దు. ఎట్టిపరిస్థితుల్లోను టెన్షన్‌కు గురికావొద్దు. దీనివల్ల తెలిసిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతారు. తప్పకుండా ఈ విషయాల పట్ల దృష్టిపెట్టండి.

పూర్తిగా సిద్ధమవండి

మీరు కంపెనీలో ఏ ఉద్యోగానికి అప్లై చేసుకున్నారో ముందుగానే దాని గురించి పూర్తిగా స్టడీ చేయండి. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నల రకం గురించి ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసి నాలెడ్జ్‌ పెంచుకోండి. ఎలాంటి క్వశ్చన్‌ అడిగినా టెన్షన్‌ పడకుండా మీకు తెలిసిన సమాధానం చెప్పండి.

ఒత్తిడి నుంచి బయటపడడం ఎలా..

ఒత్తిడిని తగ్గించుకోవడానికి స్ట్రెస్ రిలాక్సేషన్ టెక్నిక్‌లను పాటించాలి. దీని కోసం మీరు మ్యూజిక్‌ వినాలి. ఎందుకంటే ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడే మీరు సరిగ్గా ఇంటర్వ్యూ ఇవ్వగలరు.

విశ్వాసం ముఖ్యం

మీకు భయంగా అనిపిస్తే మీ అనుభవం, మీ ఫీల్డ్ పరిజ్ఞానం మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చిందని గుర్తుంచుకోండి. ఇంటర్వ్యూలో ఎంత నమ్మకంగా ఉన్నారనే దానిపై ప్రతిదీ ఆధారపడి ఉంటుంది. నీ మీద నీకు విశ్వాసం ఉండాలి.

పాజిటివ్‌గా ఆలోచించండి

ఎలాంటి నెగిటివ్‌ ఆలోచనలు రాకుండా చూసుకోండి. ఈ సమయంలో పాజిటివ్‌ ఆలోచనను కలిగి ఉండటం అవసరం. ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి మీ విజయాలను గుర్తు చేసుకోండి.

సరిగ్గా వినండి

ఒక ఇంటర్వ్యూలో ఎదుటి వ్యక్తి చెప్పేది సరిగ్గా వినడం సమాధానం ఇవ్వడం చాలా ముఖ్యం. అందువల్ల అవతలి వ్యక్తి చెప్పేది వినండి ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకుని ఆపై సమాధానం ఇవ్వండి.

డ్రెస్‌ కోడ్‌ ముఖ్యం

ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు సౌకర్యంగా ఉండే డ్రెస్‌ ధరించండి. ఇది మీపై మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది.

Tags:    

Similar News