Govt Jobs: NEEPCOలో ఉద్యోగాలు.. టెన్త్ అర్హతతోనే.. పరీక్ష లేకుండానే ఎంపిక..!

NEEPCO Jobs: నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2023-11-21 10:14 GMT

Govt Jobs: NEEPCOలో ఉద్యోగాలు.. టెన్త్ అర్హతతోనే.. పరీక్ష లేకుండానే ఎంపిక..!

NEEPCO Jobs: నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆసక్తి గల అభ్యర్థులు portal.mhrdnats.gov.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు..

ఇందులో వివిధ పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉండాలి. పోస్టు ప్రకారం విద్యార్హతలు ఇలా ఉన్నాయి...

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 28 పోస్టులకు బీటెక్ అర్హతగా నిర్ణయించారు.

8 టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు ఇంజినీరింగ్ డిప్లొమా ఉండాలి.

గ్రాడ్యుయేట్ జనరల్ స్ట్రీమ్ 14 పోస్టులకు, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి.

25 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ డిప్లొమా ఉండాలి.

వయస్సు..

18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం..

ఎంపికైనట్లయితే, అభ్యర్థులకు నెలకు రూ.14,877 నుంచి నెలకు రూ.18,000 వరకు స్టైపెండ్ ఇస్తారు.

ఎంపిక ప్రక్రియ..

అప్రెంటిస్‌షిప్ కోసం కోరిన డిగ్రీ లేదా డిప్లొమాలో పొందిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పవర్ స్టేషన్లు ఉన్న రాష్ట్రాల అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

Tags:    

Similar News