AP SSC Results 2023: టెన్త్ ఫలితాలు రాక..పెరిగిన ఉత్తీర్ణత శాతం..ఇంగ్లీష్ మీడియం విద్యార్థులదే హవా

AP SSC Results 2023: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు.

Update: 2023-05-06 07:44 GMT

AP SSC Results 2023: టెన్త్ ఫలితాలు రాక..పెరిగిన ఉత్తీర్ణత శాతం..ఇంగ్లీష్ మీడియం విద్యార్థులదే హవా

AP SSC Results 2023: ఏపీలో పదోతరగతి ఫలితాలు రిలీజ్ అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్ సైట్ bse.ap.gov.in లో ఫలితాలను చూడొచ్చు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జరిగిన పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోల్చితే ఈసారి 5శాతం ఉత్తీర్ణత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పాస్ పర్సంటేజ్ పెరగడం విశేషం..

గతంలో పదోతరగతి పరీక్షల్లో ఒక్కో సబ్జెక్ట్ కు రెండేసి పేపర్లు ఉండేవి ఈసారి మాత్రం ఒక పేపర్ విధానం తీసుకొచ్చారు. ఇకపోతే మొత్తం 6,05,052 మంది పరీక్ష రాశారు. వీరిలో బాలురు 3,09,245 మంది ఉంటే బాలికలు 2,95,807 మంది ఉన్నారు. బాలురు 69.27 ఉత్తీర్ణత సాధిస్తే, బాలికలు 75.38 శాతంగా ఉంది. అంటే బాలికలే పైచేయి సాధించినట్లు.

జిల్లాల వారీగా చూసుకుంటే ఉత్తీర్ణత శాతంలో పార్వతీపురం మన్యం ఇల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో పాస్ పర్సంటేజ్ 87.4 శాతం ఉంది. ఇక అతి తక్కువ ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా వెనకబడిఉంది. అక్కడ పాస్ పర్సంటేజ్ 60.39 శాతంగా ఉంది. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 95.25 శాతం మంది విద్యార్థులు పదో తరగతిలో పాస్ అయ్యారు. ఏపీ వ్యాప్తంగా 938 స్కూల్స్ 100 పర్సంట్ ఉత్తీర్ణత సాధించాయి. అయితే 38 స్కూల్స్ లో ఒక్కరు కూడా పాస్ కాలేదు. ఇక 75.8 శాతం మంది స్టూడెంట్స్ కు ఫస్ట్ క్లాస్ రాగా..పాస్ అయిన వారిలో ఇంగ్లీష్ మీడియంలో రాసిన స్టూడెంట్స్ 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఇక జూన్ 2 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. అంతేకాదు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఈ నెల 13వరకు గడువు ఉంటుంది.

Tags:    

Similar News