విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులలో మార్పులు.. కొత్త తేదీలివే..!
Sankranti Holidays 2023: ఏపీలో సంక్రాంతి సెలవుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది.
విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులలో మార్పులు.. కొత్త తేదీలివే..!
Sankranti Holidays 2023: ఏపీలో సంక్రాంతి సెలవుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అకడమిక్ క్యాలెండరప్రకారం.. తొలుత 11 నుంచి 16వ తేదీ వరకే సెలవులు ఇవ్వాలని భావించినప్పటికీ.. ఉపాధ్యాయ సంఘాల విజ్ణప్తి మేరకు అదనంగా ఒకరోజు సెలవు పొడిగింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ముక్కనుము నేపథ్యంలోనే ఈ పరిశీలన చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది. జనవరి 19వ తేదీన పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయి.