అలర్ట్‌! ఆగస్ట్ 15 నుంచి బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవులు – పూర్తి షెడ్యూల్ ఇదే

ఆగస్ట్ 15 నుంచి 17 వరకు బ్యాంకులకు వరుసగా 3 రోజుల సెలవులు, అలాగే ఈ నెలలో మొత్తం 15 రోజుల బ్యాంకు హాలిడేలు – రాష్ట్రాల వారీ పూర్తి షెడ్యూల్‌ వివరాలు ఇక్కడ చూడండి.

Update: 2025-08-13 08:12 GMT

Alert! Banks to Remain Closed for 3 Consecutive Days from August 15 – Full Holiday Schedule

బ్యాంకు పనులు ప్లాన్‌ చేస్తున్నవారికి కీలక సమాచారం. ఈ వారాంతం నుంచి వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయబడనున్నాయి. ఆగస్ట్ 15 నుంచి 17 వరకు స్వాతంత్ర్య దినోత్సవం, జన్మాష్టమి, ఆదివారం కారణంగా బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆగస్ట్ 19 కూడా సెలవుగా ప్రకటించబడింది.

ఈ వారం బ్యాంకు సెలవులు

  1. ఆగస్ట్ 15 (శుక్రవారం): స్వాతంత్ర్య దినోత్సవం, పార్సీ న్యూ ఇయర్‌, జన్మాష్టమి – దేశవ్యాప్తంగా సెలవు.
  2. ఆగస్ట్ 16 (శనివారం): జన్మాష్టమి పండుగ – గుజరాత్‌, మిజోరాం, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మెఘాలయ, జమ్ము కాశ్మీర్‌ తదితర రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత.
  3. ఆగస్ట్ 17 (ఆదివారం): వారాంతపు సెలవు – దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేత.

ఆగస్ట్ నెలలో మొత్తం బ్యాంకు సెలవులు

ఈ నెలలో స్వాతంత్ర్య దినోత్సవం, జన్మాష్టమి, గణేష్ చతుర్థి వంటి జాతీయ, ప్రాంతీయ పండుగలతో పాటు రెండో, నాల్గో శనివారాలు మరియు అన్ని ఆదివారాలు కలుపుకుని మొత్తం 15 రోజుల బ్యాంకు సెలవులు ఉండనున్నాయి.

బ్యాంకులు మూసి ఉన్నప్పుడు లావాదేవీలు ఎలా?

  1. ఆన్‌లైన్‌ & మొబైల్ బ్యాంకింగ్‌: NEFT, RTGS, UPI వంటి సేవలు యథావిధిగా పనిచేస్తాయి.
  2. ATM సేవలు: నగదు డ్రా చేసుకోవడానికి ఎప్పటిలాగే అందుబాటులో ఉంటాయి.
  3. చెక్కులు & మాన్యువల్ లావాదేవీలు: సెలవు రోజుల్లో ప్రాసెస్‌ చేయబడవు.

ఆగస్ట్ 2025లో ఇతర ముఖ్యమైన బ్యాంకు సెలవులు

  1. ఆగస్ట్ 19: మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి – త్రిపుర
  2. ఆగస్ట్ 23: నాల్గో శనివారం – దేశవ్యాప్తంగా
  3. ఆగస్ట్ 25: శ్రీమంత శంకర్‌దేవ తిరుభవ తిథి – అసోం
  4. ఆగస్ట్ 27: గణేష్ చతుర్థి – మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, గోవా తదితర రాష్ట్రాలు
  5. ఆగస్ట్ 28: నువాఖై పండుగ – ఒడిశా, గోవా
Tags:    

Similar News