రోడ్డు ప్రమాదంలో దర్శకుడు దుర్మరణం

Update: 2019-03-23 15:36 GMT

 కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మూడుబిద్రె శిర్థాడి వద్ద జరిగిన కారు ప్రమాదంలో యువ దర్శకుడు మృతి చెందాడు. కారు అదుపుతప్పి బలంగా చెట్టుకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కన్నడ దర్శకుడు హ్యరిస్‌ హౌదాల్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున హ్యరిస్‌ కారులో మూడుబిద్రె నుండి శిరిడికు వెళ్తుండగా ప్రమాదం ఛోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News