బాబు ఇలాఖాలో లైంగిక వేధింపులు..చివరికి సస్పెండ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సొంత ఇలాఖా కుప్పంలో ఓ లైంగిక వేధింపుల బాధితురాలి గోడు అరణ్య రోదనగా మారింది. చిత్తూరు జిల్లా కుప్పం తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన వీఆర్ఏ ఆనంద్‌ను కలెక్టర్ ప్రద్యుమ్న సస్పెండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సొంత ఇలాఖా కుప్పంలో ఓ లైంగిక వేధింపుల బాధితురాలి గోడు అరణ్య రోదనగా మారింది. చిత్తూరు జిల్లా కుప్పం తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన వీఆర్ఏ ఆనంద్‌ను కలెక్టర్ ప్రద్యుమ్న సస్పెండ్ చేశారు. ఇక వివరాల్లోకి వెళితే కుప్పం తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే కార్యాలయంలో భవ్య అనే మహిళ అటెండర్‌గా పనిచేస్తుంది. అయితే వీఆర్వో ఆనంద్ కన్ను భవ్వపై పడింది. ఎలాగైన తనను దక్కించుకోవాలనే కసీతో లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధించడం మొదలు పెట్టాడు ఆనంద్. కాగా భవ్య అనే అటెండర్ వీఆర్వో ఆనంద్ తనను వేధిస్తున్నాడని, వీఆర్ఏపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ మదనపల్లి సబ్‌కలెక్టర్ కీర్తితో విచారణ జరిపించారు. వీఆర్ఏపై ఆరోపణలు రుజువుకావడంతో వీఆర్ఏ ఆనంద్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు.