మేఘాలయ హనీమూన్ హత్యకేసులో సంచలన ట్విస్ట్: సోనమ్ మిస్సింగ్ డ్రామా వెనుక మరో హత్యా పథకం!
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! భార్య సోనమ్, ప్రియుడు రాజ్ కుష్వాహా మరో మహిళను హత్య చేసి మృతదేహాన్ని తగలబెట్టి తప్పించుకునే ప్లాన్ చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెలుగు.
మేఘాలయ హనీమూన్ హత్యకేసులో సంచలన ట్విస్ట్: సోనమ్ మిస్సింగ్ డ్రామా వెనుక మరో హత్యా పథకం!
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ఒక తర్వాత ఒక ట్విస్ట్ వెలుగు చూస్తుండగా, తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారాయి. ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో ఆయన భార్య సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా, ఇతర నలుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
🔥 సోనమ్ మిస్సింగ్ డ్రామా వెనుక భయంకర పథకం!
పోలీసుల తాజా వెల్లడన ప్రకారం, సోనమ్ తప్పించుకునేందుకు నిందితులు రూపొందించిన ప్లాన్ దారుణమైనదిగా ఉంది. మరో యువతిని హత్య చేసి, ఆమె మృతదేహానికి సోనమ్ యొక్క ఆభరణాలు తగిలించి, దాన్ని తగలబెట్టి సోనమ్ మృతదేహంగా చిత్రీకరించాలన్నదే వారి వ్యూహం. ఈ కథను నిజం అనిపించేలా గజీపూర్‌లో ఆమె జూన్ 9న లొంగిపోయే వరకు అన్ని చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
🔍 రాజా హత్యకు ముందే ముగ్గురు ప్లాన్లు ఫెయిల్
ఈస్ట్ ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సైమ్ వెల్లడించిన వివరాల ప్రకారం, రాజా రఘువంశీని హత్య చేయడానికి ముందే మూడు ప్లాన్లు రూపొందించారు. అయితే అవన్నీ విఫలమయ్యాయి. చివరకు మేఘాలయలోని వీసావ్‌డాంగ్ జలపాతం వద్ద రాజాను కత్తితో పొడిచి హత్య చేసి లోయలో పడేశారు.
🚨 అస్సాంలో మొదలైన దురాలోచన
నవ వధూవరులు అస్సాంలో పర్యటన ప్రారంభించడానికి ముందు నుంచే ఈ ప్లాన్ బిగించింది. మొదట గువాహటి, ఆపై షిల్లాంగ్, చివరికి వీసావ్‌డాంగ్ వరకు నిందితులు తమ స్కెచ్ అమలు చేశారు. హత్య అనంతరం రక్తపు మరకలతో ఉండటంతో, సోనమ్ తన రెయిన్ కోట్‌ను ప్రధాన నిందితుడైన ఆకాశ్‌కు ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది. కోట్‌ను ఆకాశ్ ఆ తరువాత ఓ లోయలో పారవేశాడు.
🕵️♀️ బురఖాతో తప్పించేందుకు ప్రయత్నం
రాజ్, సోనమ్‌కు బురఖా అందజేశాడు. ఆమె దాన్ని ఉపయోగించి షిల్లాంగ్ నుండి ఇండోర్ వరకు ప్రయాణించింది. షిల్లాంగ్‌లోని ఓ టూర్ గైడ్ వీరిద్దరితో పాటు మరొ ముగ్గురిని చూశానని తెలిపారు. ఇండోర్ నుంచి తప్పించుకుని కిడ్నాప్ బాధితురాలిగా నటిస్తూ సిలిగురికి చేరాలని రాజ్ సూచించాడని తెలుస్తోంది. అయితే జూన్ 8న ఆకాశ్ అరెస్ట్ కావడంతో భయపడిన సోనమ్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి "తాను కిడ్నాప్ నుంచి తప్పించుకున్నాను" అని చెప్పింది.