ఫేస్‌బుక్‌లో అశ్లీల పోస్ట్ చేసిన యువకుడిని ఓ మహిళ ఇంటికి పిలిపించి..

Update: 2019-01-23 01:22 GMT

ఫేస్‌బుక్‌లో అశ్లీల పోస్ట్‌ చిత్తూరులో కలకలం సృష్టించింది. ఒక అమ్మాయి గురించి అశ్లీల పోస్ట్ పెట్టినందుకు సాధిక్‌ను మిట్టూరులో ఉంటున్న ఓ మహిళ, ఆమె కుమారుడు కలిసి చితకబాదారు. ఇంటికి పిలిపించి విచక్షణారహితంగా కొట్టారు. ఆ తర్వాత ఆమె కుమారుడు సాదిక్ ను ఓ కళ్యాణ మంటపం దగ్గరికి తీసుకెళ్లాడు. తన స్నేహితులతో కలిసి

మళ్ళీ చావబాదాడు. ఈ ఘటనను వీడియో స్నేహితులకు షేర్ చేశాడు. శనివారం రోజు జరిగిన ఈ ఘటన చిత్తూరులో కలకలం సృష్టించింది. చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. సాదిక్ ను చితకబాదిన ఘటనలో మహిళ సహా ఏడుగురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఇందులో మైనర్లయిన నలుగురిని తిరుపతి జువైనల్ హోంకు తరలించారు. 

Similar News