షర్మిలపై అసభ్యకర కామెంట్లు.. మరో వ్యక్తి అరెస్ట్..

Update: 2019-03-26 01:07 GMT

ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరిపై సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యక్తి అసభ్యకర కామెంట్లు పెట్టినట్లు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో అతన్ని అరెస్టు చేశారు. మహిళల గౌరవాన్ని దిగజార్చేలా ఆ వ్యక్తి కామెంట్లు పెట్టినట్టు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ ప్రారంభించిన రాయదుర్గం పోలీసులు మొబైల్ ఐపీ అడ్రస్‌ ఆధారంగా హరీశ్‌చౌదరి అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నిందితుడి స్వస్థలం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం బొమ్మనంపాడు.

గత 15 ఏళ్లుగా ఇతను చౌటుప్పల్‌లో ఉంటున్నాడు. కొంతకాలంగా అతను షర్మిలపై అసత్య ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా గతంలోనే షర్మిల తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. 

Similar News