రేప్ చేశాడు ఆ గాయం ముద్రతో దొరికాడు!

ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిలాలో చోటుచేసుకుంది.

Update: 2019-09-30 11:35 GMT

ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిలాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత జూన్ లో ఓ ఏబై ఏళ్ల మహిళ ఒంటరిగా వెళ్తుండగా లఖన్ దేవకర్ అనే వ్యక్తి ఆమెను ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారాని ఒడిగట్టాడు. బాధితురాలు తెరుకునేలోగా.. లఖన్ అక్కడి నుంచి పరారైయ్యాడు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం స్లమ్ ఏరియాలో పోలీసులు గాలించారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. అత్యాచారం జరిపే సమయంలో నిందితుడు ఆమె ఛాతిపై పంటిగాటుతో గాయం చేశాడు. దీంతో తమ శైలిలో విచారించారు. నిందితుడు లఖన్ తన నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని బాలాజీ పందేర్ వెల్లడించారు.

Tags:    

Similar News