హైదరాబాద్‌లో లారీ బీభ్సతం

Update: 2019-05-22 05:19 GMT

హైదరాబాద్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళుతున్న లారీ అదుపు తప్పి ప్రయివేట్ స్కూల్ బాస్ పైకి దూసుకు పోయింది. దాంతో ప్రమాదం చోటుచేసుకుంది. రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఖాజాగూడ చౌరస్తాలో ఈ ఘటన చోటు చేసుకుంది.  ఇటుక లోడ్‌తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి  ఓ ప్రైవేటు స్కూల్‌ బస్‌ను ఢీ కొట్టింది. అయితే ఆ సమయంలో బస్‌లో విద్యార్థులు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. అతివేగంతో దూసుకురావడంతో బస్సును ఢీకొని తరువాత లారీ టైరు పక్కనే ఉన్న  నాలా గోడ పైకి ఎక్కింది. అయితే లారీ బ్రేకులు ఫేయిల్‌ కావడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.  

Similar News