ఆ యాంకర్‌ ద్వారా జయరామ్‌ను తన ఇంటికి పిలిచా.. రాకేష్

Update: 2019-02-04 02:54 GMT

వ్యాపారవేత్త, కోస్టల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ చిగురుపాటి జయరామ్‌ హత్య కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో జయరామ్‌ మేనకోడలు శిఖా చౌదరి సూత్రధారిగా, ఆమె ప్రియుడు రాకేష్‌రెడ్డి హంతకుడిగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. నిందితుడు రాకేష్‌ రెడ్డి విస్తుపోయే వివరాలు వెల్లడించారు… ఓ ఆ యాంకర్‌ ద్వారా జయరామ్‌ను తన ఇంటికి పిలిచా.. రాకేష్
 

 పిలిపించానని…. డబ్బు విషయమై జయరామ్‌తో గొడవ నెలకొందని రాకేష్‌ రెడ్డి పోలీసులుకు వివరించాడు… తన ఇంటిలోనే జయరామ్‌ను చంపేశానన్న రాకేష్‌రెడ్డి… తనతో పాటు ఇంట్లో ఉన్న సహాయకుల హస్తం ఉన్నట్లు వివరించాడు.

అంతేకాదు శిఖా చౌదరితో గతంలో డేటింగ్‌ కూడా చేసిన విషయాన్ని రాకేష్‌ విచారణలో తెలిపాడు. శిఖాచౌదరికి చాలా మందితో సంబంధాలు ఉన్నాయని ఈ కారణంగా పెళ్లి వరకు వెళ్లిన తమ సంబంధం ఆగిపోయిందని వెల్లడించినట్టు తెలుస్తోంది. కాగా రాకేష్‌రెడ్డిని రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో హత్య చేసి మృతదేహాన్ని కృష్ణా జిల్లాలో పడేయడం గురించి పోలీసులు కూపీ లాగుతున్నారు. జయరామ్‌కు ఫోన్‌ చేసిన యాంకర్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల అదుపులోనే శిఖాచౌదరి ఉంది. మరోవైపు తన భర్తను ఎవరు హత్యచేసారో తనకు తెలియదని.. ఇక్కడి విషయాలు ఏవి తనకు తెలియవని జయరామ్ భార్య పద్మజ వెల్లడించారు. తనకు భద్రత కల్పించాలని లాయర్ ద్వారా ఆమె పోలీసులను కోరుతున్నారు. 

Similar News