జగన్ కేసులో తీవ్రంగా శ్రమిస్తోన్న ఎన్‌ఐఎ.. వైసీపీ నేతలు కూడా..

Update: 2019-01-19 14:54 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వై.ఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై కత్తి దాడి కేసు వాస్తవాలు తేల్చేందుకు ఎన్‌ఐఎ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. విచారణలో భాగంగా వైసీపీ నేతలను కూడా ప్రశ్నించింది. ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన పలువరు నేతలను.. ఘటనపై వివారాలు అడిగారు. దాడి జరిగిన రోజు జగన్‌తో ఉన్న వారందర్ని ఎన్‌ఐఎ అధికారులు ప్రశ్నించింది. విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ నేత మళ్ల విజయ ప్రసాద్‌ ఇంటికి చేరుకున్న ఎన్‌ఐఏ అధికారులు పలువురు నేతలను విచారించారు.. కాకినాడకు చెందిన ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, విజయనగరం జిల్లాకు చెందిన మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, జియ్యాని శ్రీధర్‌, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌ కుమార్‌, కరణం ధర్మశ్రీ తదితర నేతలను విచారించారు. మరోవైపు హత్యాయత్నం కేసును NIA విచారణ నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్‌ను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. 

Similar News