ఎన్నికల వేళ భారీగా పట్టుబడ్డ నగదు

Update: 2019-04-01 06:23 GMT

సార్వత్రిక ఎన్నికల వేళ తమిళనాడులో భారీగా నగదు పట్టుబడింది. తమిళనాడులోని వేలూరు జిల్లా కాట్పాడిలో భారీగా నగదు పట్టుబడింది. కాట్పాడిలో దగ్గర సిమెంట్‌ గోడౌన్‌లో దాచి ఉంచిన నగదును ఈసీ గుర్తించింది. డీఎంకే కోశాధికారి దురై మురుగన్‌కు చెందిన కళాశాల, సిమెంట్ ఫ్యాక్టరీలో సోమవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. గోనె సంచులు, అట్ట పెట్టెల్లో ప్రత్యేకంగా ప్యాక్ చేసిన బండళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రెండు , ఐదు వందల నోట్లతో పాటు 2 వేల రూపాయల నోట్లు ఉన్నట్టు గుర్తించారు. నగదు భారీగా ఉండటంతో ప్రత్యేక సిబ్బంది ద్వారా లెక్కిస్తున్నారు. సిమెంట్ గోడౌన్‌ యజమాని అందుబాటులో లేకపోవడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. సుమారు రూ. 20 కోట్లకుపైగా నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నగదును సీజ్ చేసి రిజర్వ్‌ బ్యాంక్‌కు తరలించారు. 

Similar News