అప్పుల బాధతో కుటుంబం బలవన్మరణం

Update: 2019-07-07 06:46 GMT

విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ఓ చిన్ని కుటుంబాన్ని అప్పులు కాటేశాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు. కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగి ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గరివిడి మండలం సింహాద్రి ఈశ్వర్ రావు అప్పుల బాధతో భార్య, బిడ్డతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈశ్వర్ రావు అతని కూతురు పదమూడేళ్ల చాందిని మృతి చెందగా, భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. గోపాలపట్నం పీఎస్ లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా, గరివిడి మండలం, కొండపాలెం గ్రామం అటుకా కాలనీకి చెందిన దంపతులు సింహాద్రి ఈశ్వరరావు(46), చంద్రకళ(39), తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె చాందిని (13) శనివారం సింహగిరిపై వరాహ లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకున్నారు.అక్కడ నుంచి కొండ దిగువనున్న ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. ఈశ్వరరావు తన వద్ద వున్న కూల్‌ డ్రింక్‌ తీసి కొంచెం తాగి తన కుమార్తె చాందినికి ఇచ్చాడు. ఆమె కొంచెం తాగిన తరువాత తన తల్లి చంద్రకళకు ఇచ్చింది. అయితే కూల్‌డ్రింక్‌ నుంచి ఎదో వాసన రావడంతో చంద్రకళ కొంచెం నోట్లో పొసుకొని టక్కున ఉమ్మేసింది. అయితే అప్పటికే తండ్రి, కుతూరు వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరకున్నారు. స్ధానికుల సహాయంతో 108కి ఫోన్ చేసి దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే తండ్రి కుతూరు ప్రాణాలు వీడిచారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతుని వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌లో మాత్రం తనకు ఆర్థిక ఇబ్బందులు వున్నందునే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసి వున్నదని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు గోపాలపట్నం సీఐ రమణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News