Road Accident: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..డీసీఎం ఢీకొని ఆర్టీసీ బస్సు దగ్ధం
Road Accident: ఉమ్మడి మహమూబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వ్యాన్ ఢీకొన్ని ఆర్టీసీ బస్సు దగ్ధమయ్యింది. జాతీయ రహదారిపై 44 పై జరిగిన రోడ్డుప్రమాదంలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు పూర్తిగా దగ్దమయ్యింది.
Road Accident: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..డీసీఎం ఢీకొని ఆర్టీసీ బస్సు దగ్ధం
Road Accident:జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు మంటల్లో కాలిపోయింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి సమీపంలో ఆదివారం అర్థరాత్రి 1.45 గంటల ప్రాంతంలో ఈ ఘన చోటుచేసుకుంది. ఏపీలోని శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఆర్టీసీ డీపోకు చెందిన బస్సు ఆదివారం రాత్రి 12గంటలకు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులో బయలు దేరింది. జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి మలుపు దగ్గరకు చేరుకోగానే సరుకు రవాణా వాహనం డీసీఎం యూటర్న్ తీసుకునేందుకు ఒక్కసారి మలుపు తిరుగుతున్న క్రమంలో ఆర్టీసీ బస్సు డీసీఎం ఢీకున్నాయి.
బస్సు అదుపు తప్పి కుడివైపు రోడ్డుకు కిందకు దూసుకుపోయింది. డ్రైవర్, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన మిగతా ప్రయాణికులు అద్దలు పగులగొట్టుకుని బయటకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన వారిని కాపాడే ప్రయత్రం చేశారు. అంతలోనే పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈలోగా బస్సులో మంటలు వ్యాపించి బస్సు మొత్తం దగ్దమయ్యింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.