Woman Killed: ఏడు రోజులపాటు మృతదేహాన్ని కాల్చాడు.. ఝాన్సీలో ఒళ్లు గగుర్పొడిచే హత్య
Woman Killed: ఝాన్సీలో సహజీవనం చేస్తున్న మహిళను ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఇనుప పెట్టెలో కాల్చిన ఘటన కలకలం రేపింది.
Woman Killed: ఏడు రోజులపాటు మృతదేహాన్ని కాల్చాడు.. ఝాన్సీలో ఒళ్లు గగుర్పొడిచే హత్య
Woman Killed: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఒక అత్యంత కిరాతక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న మహిళను ఆమె ప్రియుడు అత్యంత దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఇనుప పెట్టెలో పెట్టి కాల్చిన ఘటన కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, ఝాన్సీకి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి రామ్ సింగ్ పరిహార్ (64) గత ఆరేళ్లుగా ప్రీతి (35) అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. డబ్బు విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా, ఈ క్రమంలో జనవరి 8న పరిహార్ ప్రీతిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
హత్య అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని ముక్కలుగా చేసి, అద్దె ఇంట్లో ఉన్న ఓ పెద్ద ఇనుప పెట్టెలో వేసి దహనం చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఏడు రోజుల పాటు రోజూ కొన్ని భాగాలను కాల్చినట్లు విచారణలో తేలింది.
శనివారం రాత్రి మిగిలిన శరీర భాగాలు, కాలిపోయిన ఎముకలు ఉన్న పెట్టెను మరోచోటికి తరలించేందుకు ఓ లోడర్ ఆటోను మాట్లాడుకున్నాడు. అయితే పెట్టె నుంచి వస్తున్న తీవ్రమైన దుర్వాసన, కారుతున్న ద్రవాలతో అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు అక్కడికి చేరుకునేలోపే నిందితుడు పరారయ్యాడు. పెట్టెను తెరిచి పరిశీలించగా, అందులో కాలిపోయిన మనిషి ఎముకలు, శరీర భాగాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కుమారుడు సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న రామ్ సింగ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.