రజినీ వర్సెస్ అజిత్.. కత్తులతో పొడుచుకున్న వీరాభిమానులు..!
తెరపై చూడాల్సిన యాక్షన్ సీన్స్‌ను తమిళ అభిమానులు కళ్లముందే చూపించారు. ఏకంగా కత్తులతో దాడికి దిగారు.
తెరపై చూడాల్సిన యాక్షన్ సీన్స్‌ను తమిళ అభిమానులు కళ్లముందే చూపించారు. ఏకంగా కత్తులతో దాడికి దిగారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ పేట, మరో హీరో అజిత్ విశ్వాసం సినిమాలు రెండూ ఇవాళ విడుదలయ్యాయి. చాలాచోట్ల పక్క పక్క థియేటర్లలో ఆడుతున్నాయి. భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల సినిమాలకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దీంతో తొలుత ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఫ్లెక్సీ చింపేయడంతో గొడవ ప్రారంభమైనట్లు చెబుతున్నారు. ఏకంగా కత్తులతో దాడికి దిగడంతో నలుగురికి కత్తిపోట్లకు గురయ్యారు. ఆ నలుగురికి పరిస్థితి ప్రస్తుతం విషమంగా మారింది. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.