సహకరించని గ్రామస్తులు.. తల్లి శవాన్ని సైకిల్‌పై

మనుషులకు కుల బహిష్కరణ శిక్ష విధించడం ఈ లోకంలో సర్వసాధారణం! కానీ చనిపోయిన మృతదేహాన్ని కూడా ఏ ఒక్కరు కూడా కనీసం చూడలేదు కదా, ఖననం చేయాడానికి కూడా ఏ ఒక్కరు కూడా సహాకరించకపోవడంతో కన్న కొడుకే తల్లిని సైకిల్ పై తీసుకెళ్లి దహానం చేయాల్సివచ్చింది.

Update: 2019-01-17 08:57 GMT

మనుషులకు కుల బహిష్కరణ శిక్ష విధించడం ఈ లోకంలో సర్వసాధారణం! కానీ చనిపోయిన మృతదేహాన్ని కూడా ఏ ఒక్కరు కూడా కనీసం చూడలేదు కదా, ఖననం చేయాడానికి కూడా ఏ ఒక్కరు కూడా సహాకరించకపోవడంతో కన్న కొడుకే తల్లిని సైకిల్ పై తీసుకెళ్లి దహానం చేయాల్సివచ్చింది. ఈ దారుణం ఒడిశాలోని కర్పాబహాల్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామంలో జాంకి సిన్హానియా(45)తన కొడుకు సరోజ్ (17) కలిసి నివసిస్తున్నారు. ఇటివలే జాంకి సిన్హానియా భర్త తీవ్ర అనారోగ్యంతో చనిపోయాడు. కాగా జాంకి సిన్హానియా రోజువారి దినసరి కూలీకి వెళుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా ఇటీవల మంచి నీళ్లకోసమని ఓ బావి దగ్గరకు వెళ్లిన తల్లి అదుపుతప్పి బావిలో పడి చనిపోయింది. అయితే తన తల్లిని అంత్యక్రియలకు సహకరించాలని తన కొడుకు సరోజ్ ఆ గ్రామస్థులను వేడుకున్నాడు. కాని ఏ ఒక్కరు కూడా సహాయం చేయాడానికి ముందుకు రాలేదు దీంతో శవాన్ని సైకిల్ పై దాదాపు 6కిలో మీటర్ల దూరంలో ఉన్న అడవిలో ఖననం చేశాడు సరోజ్. ఆ గ్రామస్థులను తాను ఎంత వేడుకున్న, మొరపెట్టుకున్న కాని ఎవరు కూడా సహకరించలేదని సరోజ్ వాపోయాడు. కేవలం తాము తక్కువ కులం అనే పేరుతోనే ఈ గ్రామస్థులంతా తమను దూరం పెట్టారని సరోజ్ వాపోయాడు. 

Similar News