ఓయూ ఇంజినీరింగ్ గర్ల్స్ హాస్టల్‌లో కలకలం

ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ గర్ల్స్ హాస్టల్‌లో కలకలం రేగింది. అర్ధరాత్రి హాస్టల్ లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి హల్ చల్ చేశాడు.

Update: 2019-08-16 04:17 GMT

ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ గర్ల్స్ హాస్టల్‌లో కలకలం రేగింది. అర్ధరాత్రి హాస్టల్ లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి హల్ చల్ చేశాడు. రాత్రివేళ ఓ విద్యార్థిని వాష్ రూమ్ లోకి వెళ్లింది. బయట నుంచి ఆగంతకుడు గడియ పెట్టాడు. అమ్మాయి భయంతో కేకలు వేసింది. వాష్ రూమ్ లోకి ప్రవేశించిన ఆగంతకుడు అరవొద్దని కత్తి చూపించి భయపెట్టాడు. అసభ్యంగా ప్రవర్తించబోగా విద్యార్థిని గట్టిగా కేకలు వేసింది. వెంటనే చుట్టుపక్కల రూమ్ ల విద్యార్థినులు వాష్ రూమ్ వద్దకు వచ్చారు.

కత్తితో విద్యార్థినులకు ఆగంతకుడు భయపెడుతూ హాస్టల్ ఫస్ట్ ఫ్లోర్ పై నుంచి కిందకు దిగి పారిపోయాడు. బాధిత విద్యార్థిని సెల్ ఫోన్ ఎత్తుకెళ్లాడు. ఇంజినీరింగ్ గర్ల్స్ హాస్టల్ లో గుర్తు తెలియని వ్యక్తి హంగామా గురించి విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీమ్ తో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హాస్టల్ వెనుక వద్ద గల కంపౌండ్ వాల్ వద్ద బాధిత విద్యార్థిని సెల్ ఫోన్ పగిలిపోయిన స్థితిలో వుంది. ఈ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Tags:    

Similar News