అలహాబాద్ బ్యాంకునూ ముంచిన భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌

Update: 2019-07-14 12:19 GMT

అలహాబాద్‌ బ్యాంక్‌ భారీగా మోసబోయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తరువాత రెండో ప్రభుత్వరంగ బ్యాంక్‌ అలహాబాద్ బ్యాంక్ నిలించింది. ఈ బ్యాంక్‌ను దివాలలో ఉన్న భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ సంస్థ మోసం చేసినట్లు తేలింది. ఈ మోసంతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న బ్యాంకింగ్‌ పరిశ్రమ మరిన్ని కష్టాల్లోకి జారింది.

ఇప్పటికే ఈ విషయాన్ని ఆర్‌బీఐకు వెల్లడించినట్లు అలహాబాద్‌ బ్యాంక్‌ పేర్కొంది. మోసం మొత్తం విలువ 259 మిలియన్‌ డాలర్లు (రూ. 17,75,71,17,700) ఉంటుందని అంచనా. ఇదే నెల 6వ తేదీన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లోని భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ సంస్థ ఖాతాలో 554.6 మిలియన్‌ డాలర్ల మోసం జరిగినట్లు తేలింది.

'' ఆ కంపెనీ బ్యాంక్‌ నిధులను దుర్వినియోగం చేసినట్లు తేలింది. కన్సార్టియంలోని బ్యాంకును అప్పులు పుట్టించేందుకు పుస్తకాలను మార్చేసింది. '' అని అలహాబాద్‌ బ్యాంక్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఇప్పటికే 131 మిలియన్‌ డాలర్ల ప్రొవిజన్లను ఏర్పాటు చేసినట్లు బ్యాంక్‌ పేర్కొంది.

Tags:    

Similar News