బయటపడ్డ అమెరికా వేసిన బాంబు

Update: 2018-08-27 10:09 GMT

ప్రపంచాన్ని వణికించిన యుద్దాలు రెండు.. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం.  మొదటి దానితో  పోల్చుకుంటే రెండో యుద్ధం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు.. ఆ  యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు వదిలారు. అయితే అంత ఘోరం జరగడానికి ఓ కారణం ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన ఫిరంగులు, బాంబుల వలెనే అంతమంది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలమంది ప్రాణాలు తీసిన నాటి బాంబు ఒకటి బయటపడటంతో జనాలు మరోసారి ఆందోళన చెందారు. ఈ సంఘటన జర్మనిలో చోటుచేసుకుంది. జర్మనిలో ఓ బహుళ అంతస్థు నిర్మాణ పనుల జరుగుతున్న సమయంలో ఇది బయటపడింది. దీంతో వారు పురావస్తు అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి పురావస్తు అధికారులు లుడ్‌విగ్‌షాఫెన్ నగరంలోని 18500 మంది ప్రజలను ఖాళీ చేయించారు. అనంతరం బాంబు డిస్పోజల్ టీమ్ ను రప్పించి..  దానిని సురక్షితంగా నిర్వీర్యం చేశారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో జర్మనీపై అమెరికా దళాలు వేసిన ఈ బాంబు బరువు సుమారు 500 కిలోలుగా ఉంది. కాగా రెండో ప్రపంచ యుద్ధం జరిగి 70 గడిచినా అక్కడక్కడా ఈ తరహా బాంబులు బయటపడుతున్నాయి. గతేడాది కూడా ఫ్రాంక్‌ఫర్ట్‌లో 1.8 టన్నుల బరువున్న బ్రిటన్ బాంబు బయటపడింది. 

Similar News