ముసలోడి బైక్ స్టంట్స్ చూస్తే ఆశ్చర్యపోతారు!

Update: 2018-07-23 09:17 GMT

ఒక వయసు దాటిన తర్వాత బైక్ నడపడమే కష్టంగా ఉంటుంది చాలామందికి. అయితే ఓ ముసలోడు మాత్రం బైక్ మీద విన్యాసాలే చేస్తున్నాడు. వేగంగా వెళ్తున్న బైక్‌పై కూర్చొని, పడుకుని, నిల్చొని మనోడు చేస్తున్న స్టంట్స్ చూస్తే ‘అబ్బో...’ అని ఆశ్చర్యంతో నోరు తెరవడం గ్యారెంటీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోందీ వీడియో. హర్యానాకు చెందిన ఈ వ్యక్తి రెండు చేతులు వదిలేసి వాహనాన్ని నడపటమే కాదు దానిపై రకరకాల విన్యాసాలు చేస్తూ ఆ దారిలో ప్రయాణించే వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ దృశ్యాలను ఆ ద్విచక్రవాహనం వెనుకే వస్తున్న మరో వ్యక్తి సెల్ ఫోన్ లో షూట్ చేశాడు. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

వైరల్‌ అవుతోన్న ఈ వీడియోలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కనీసం హెల్మెట్ కూడా ధరించకుండా అత్యంత ప్రమాదకరంగా విన్యాసాలు  చేశాడు. వైరల్‌గా మారిన ఈ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రమాదకరమైన విన్యాసాలతో  అతనితోపాటు ఆ దారిలో వచ్చే వారికి కూడా ప్రమాదకరంగా మారాడు. ఇలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిపై పోలీసు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. 

Similar News