వరవరరావుకు హైకోర్టులో చుక్కెదురు

Update: 2018-11-16 15:32 GMT

విరసం(విప్లవ రచయితల సంఘం) నేత వరవరరావుకు హైకోర్టులో చుక్కెదురైంది. తనపై పూణే పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారని.. దానిని కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని పుణేకు ఆయనను తరలించేందుకు జారీ అయిన ట్రాన్సిట్‌ వారెంట్‌ అమలును ఇటీవల తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించగా.. తాజాగా పూణే పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మావోయిస్టులకు వరవరరావు నిధులు సమకూర్చారని ఆరోపిస్తూ పూణే నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్‌లోని వరవరరావు నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేసి ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు కుట్ర పన్నారనే అభియోగంతో ఆయనపై కేసు నమోదయింది.
 

Similar News