అల్పాహారం కోసం ఆ సీఎం చేసిన ఖర్చు అక్షరాలా అరకోటి...!

Update: 2018-02-06 10:04 GMT

పదవిలోకి వచ్చి సంవత్సరం కూడా దాటకుండానే ఉత్తరాఖండ్ సీఎం ఫలహారాల ఖర్చు అరకోటి దాటిపోయింది. చిరుతిళ్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన పెట్టిన ఖర్చు చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్. గతేడాది మార్చి 18న ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్ర సింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. క్యాంపు ఆఫీస్‌కు వచ్చిన ప్రతి అతిథికి మర్యాద చేయడం ఈ సీఎంకు అలవాటు. తమ పనులు, అవసరాల కోసం వచ్చే ప్రతి వ్యక్తికి.. కాస్త వారి ఆకలిని తీర్చే మనసున్న మనిషి ఈ సీఎం. 

అయితే త్రివేంద్ర సింగ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ ఏడాది జనవరి వరకు టీ, అల్పాహారం కోసం ఎంత ఖర్చు చేశారని నైనిటాల్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఆర్టీఐకి దరఖాస్తు చేసుకున్నాడు. అల్పాహారం, చాయ్ కోసం పది నెలల కాలంలో రూ. 68,59,865లు ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో సీఎం త్రివేంద్ర సింగ్‌ను కొందరు మెచ్చుకుంటుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. అల్పాహారం కోసం అధిక మొత్తంలో ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రూ. 68 లక్షలు వృధా చేశారని సీఎంపై పలువురు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. 
 

Similar News