జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చెప్పుతో దాడి

Update: 2018-01-24 11:37 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గుర్తు తెలియని వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. ఖమ్మం పర్యటనలో పవన్‌పై ఓ దుండగుడు చెప్పు విసరడం కలకలం రేపింది. ఓపెన్‌టాప్ వెహికల్‌లో అభిమానులకు అభివాదం చేసుకుంటూ పవన్‌ ర్యాలీ ... తల్లాడ సెంటర్‌కు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు భారీగా గుమిగూడారు. జన సమూహంలో  నుంచి ఓ వ్యక్తి పవన్‌పైకి చెప్పు విసిరాడు. అయితే అది కారు బ్యానెట్‌పై పడడంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అనంతరం ఖమ్మంలో ఎంబీ గార్డెన్స్‌లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో పవన్‌ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పవన్ ప్రసంగిస్తూ.. ‘‘నాపై దాడులు చేసినా ఎదురుదాడి చేయను. ప్రజల కోసం ఏమైనా భరిస్తానని అన్నారు.

Similar News