డోనాల్డ్ ట్రంప్ కు మళ్ళీ చిర్రెత్తుకొచ్చింది.

Update: 2018-09-01 02:56 GMT

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు మళ్ళి చిర్రెత్తుకొచ్చింది. అమెరికా పట్ల WTO (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజషన్)అనైతికంగా వ్యవహరిస్తోందని.. WTO తన రూల్స్‌ను మార్చకపోతే ఆ సంస్థ నుంచి వైదొలుగుతామని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్‌ వరుసగా ప్రకటిస్తున్న రక్షణాత్మక విధానాలు వాణిజ్య పోరుకు తెరతీస్తున్న నేపథ్యంలో వాణిజ్య వివాదాల పరిష్కారానికి WTO కృషి చేస్తోంది.. ప్రస్తుతం  అమెరికా సహాయ నిరాకరణతో ఈ సంస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. WTOలో ఇటీవల పదవీ విరమణ చేసిన ఒక న్యాయమూర్తిని మళ్ళీ  నియమించడంతో వివాదం ముదిరింది. దీంతో  WTO వాణిజ్య వివాదాల పరిష్కార సామర్ధ్యాన్ని కోల్పోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ సర్కారు WTO నిర్ణయాన్ని తిరస్కరించింది. ఇప్పటికే పారిస్‌ పర్యావరణ పరిరక్షణ ఒప్పందం, ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం వంటి వాటి నుంచి వైదొలగిన అమెరికా.. తాజాగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజషన్(ప్రపంచ వాణిజ్య సంస్థ) నుంచి కూడా తప్పుకుంటామని అనడంతో ఆందోళన నెలకొంది.

Similar News