పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు రెచ్చిపోయారు. బీజేపీకి చెందిన ఓ మహిళా కార్యకర్తపై టీఎంసీ నేతలు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దారుణ సంఘటన సెప్టెంబర్ 26న చోటు చేసుకోగా... ఆలస్యంగా వెలుగు చూసింది. సెప్టెంబర్ 26 న బీజేపీ రాష్ట్ర బంద్ నేపథ్యంలో దిసర్కార్ అనే మహిళా నేత తమ కార్యకర్తలతో కోల్‌కతాకు 40 కిలోమీటర్లో దూరంలో ఉన్న బారసత్‌లో రైల్‌రోకో నిర్వహించే ప్రయత్నం చేశారు. దీనిని అడ్డుకునేందుకు వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ నేత, ఆ పంచాయతీ ఛీఫ్ అర్షదుజ్జమాన్ సదరు మహిళపై దాడి చేశాడు. కర్రలతో ఆమెను కొడుతూ ఒక తన్ను తన్ని పరుగెత్తించాడు. ఈ ఘటననంతా ఒకరు సెల్ఫోన్లో రికార్డ్ చేశారు. ఇక ఈ దాడి గురించి ఆమెను ఓ మీడియా రిపోర్టర్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా.. మరోసారి ఆమెపై మీడియా సాక్షిగానే దాడి చేశారు. ఈ వరుస ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
This is the same lady Nilima De Sarkar who was "kicked" by tmc leader Arshadujjaman. Look how his accomplice Qutubuddin is thrashing her openly when she is relaying the incident to media ! @BJP4Bengal @me_locket @VijayaRahatkar @MrsGandhi pic.twitter.com/swr35EOVK9
— Keya Ghosh (@keyakahe) September 30, 2018