తెలంగాణలో ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం

Update: 2018-05-04 05:35 GMT

తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ కూడా గాలిదుమారం, వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల రాకకు ముందు ఈ పరిస్థితులు ఏర్పడుతాయని సూచించింది. సాధారణంగా అధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతంలో క్యుములో నింబస్‌ మేఘాలు ఏర్పడుతాయని చెప్పారు. దీంతో ఉరుములు, పిడుగులు, గాలిదుమారం, వర్షం కురుస్తూ ఉంటుందన్నారు. ప్రస్తుతం ఒడిషా, విదర్భ మీదుగా రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడి ఉన్నాయి. మరోవైపు విదర్భ నుంచి లక్షదీవుల వరకు కర్ణాటక మీదుగా ద్రోణి విస్తరించి ఉండటంతో గాలిలో తేమశాతం పెరిగిందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ, నైరుతి దిక్కుల నుంచి వస్తున్న తేమ గాలులతో తెలుగు రాష్ట్రాలపై క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 

Similar News