సీబీఐటీ విద్యార్ధులకు షాకిచ్చిన యాజమాన్యం

Update: 2017-12-12 07:18 GMT

విద్యార్ధుల ఆందోళనలపై సీబీఐటీ యాజమాన్యం స్పందించింది. యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను ప్రకటించిన ప్రిన్సిపల్‌ రవీందర్‌రెడ్డి  హైకోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ నిబంధనల మేరకే ఫీజులు పెంచడం జరిగిందన్నారు. పెంచిన ఫీజులను ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్ధులు చెల్లించాల్సిందేనని స్పష్టంచేశారు. ఎవరైనా చెల్లించలేని పేద విద్యార్ధులుంటే దరఖాస్తు చేసుకోవాలని, వాళ్లకు స్కాలర్‌షిప్‌ మంజూరుచేసే విషయాన్ని పరిశీలిస్తామని సర్క్యులర్‌‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ పెంచిన ఫీజులను వసూలు చేయడం జరుగుతుందని యాజమాన్యం తేల్చిచెప్పింది. అంతేకాదు సీబీఐటీ ఆవరణలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే విద్యార్ధులను కాలేజీ నుంచి తొలగించడానికి వెనుకాడబోమని హెచ్చరించింది.

Similar News