ఆన్‌లైన్ పంచాయతీ

Update: 2018-12-26 09:17 GMT

మీ దగ్గర కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ఉందా ? దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా ? అయితే,  పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా ఎవరు పోటీ చేస్తున్నారు,  అతడి వివరాలను తెలంగాణ రాష్ట్ర్ర ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో చూడవచ్చు. ఎన్నికలు ముగిసిన రోజు ఫలితాలను కూడా తెలుసుకోవచ్చు. త్వరలోతెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పల్లెల్లో సందడి నెలకొంది. సర్పంచ్ బరిలో నిలిచేదేవారు, వార్డు మెంబర్లుగా పోటీ చేసేదేవరూ అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల పూర్తి సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర్ర ఎన్నికల కమిషన్ (tsec. gov. in) వెబ్ సైట్ లో అందించనుంది. 

పంచాయతీల్లో పోటీ చేసేవారి కోసం ప్రత్యేక పోర్టల్ ను రూపొందించారు. ఈ పోర్టల్ లో అభ్యర్థుల అర్హతలు, పాటించావల్సిన నియమావళి ఉంది. ఓటర్ల లిస్ట్ కూడా లభిస్తుంది. నామినేషన్ ఆన్ లైన్ లో భర్తీ చేసి, దాన్ని ప్రింట్ తీసి ఎన్నికల అధికారికి సమర్పించవచ్చు. తెలంగాణ రాష్ట్ర్ర ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో గ్రామంలో గతంలో పోటీ చేసిన ప్రజాప్రతినిధుల వివరాలు, ప్రస్తుతం పోటీ చేసే అభ్యర్థుల సమాచారం కూడా ఉంటుంది. ఓటర్లు ఆన్ లైన్ లో ఓటర్ స్లిప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎన్నికలు ముగిసిన రోజు ఫలితాలను వెబ్ సైట్ లో ఉంచుతారు. ఏ గ్రామంలో ఎవరు గెలిచారు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు .   

Similar News