రెబల్ అభ్యర్ధులపై కాంగ్రెస్‌ సంచలన నిర్ణయం... 24మందిపై వేటు

Update: 2018-11-24 12:51 GMT

రెబల్‌ అభ్యర్ధులపై కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. రెబల్‌ అభ్యర్ధులపై కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. రెబల్‌ అభ్యర్ధులపై కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. రెబల్‌ అభ్యర్ధులపై కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుని రెబల్ అభ్యర్థులను 7 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

రెబల్‌ అభ్యర్ధులపై కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. బుజ్జగించినా నామినేషన్లు ఉపసంహరించుకోని లీడర్లపై వేటేసింది. పార్టీ హైకమాండ్‌ నిర్ణయాన్ని ధిక్కరించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన 19మంది రెబల్‌ అభ్యర్ధులను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. నారాయణపేటలో రెబల్‌ అభ్యర్ధి శివకుమార్‌తోపాటు మరో ఐదుగురు స్థానిక నేతలపైనా బహిష్కరణ వేటు వేశారు. శివకుమార్‌తోపాటు చిట్టెం అభిజయ్‌రెడ్డి, కావలి నరహరి, సాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, సౌభాగ్య లక్ష్మి‌ని పార్టీ నుంచి బహిష్కరించారు.

కాంగ్రెస్‌ పార్టీ బహిష్కరణ వేటేసిన నేతల్లో రవి శ్రీనివాస్‌(సిర్పూర్‌‌‌), బోడ జనార్దన్‌‌(చెన్నూరు), హరినాయక్‌(ఖానాపూర్‌), అనిల్ యాదవ్‌ (బోథ్‌), నారాయణరావు పటేల్‌ (ముథోల్‌), శివకుమార్‌ (నారాయణపేట), రాములునాయక్‌ (వైరా), అరుణతార (జుక్కల్‌), రత్నాకర్‌, (నిజామాబాద్‌ అర్బన్‌), శ్రీగణేష్‌ (సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌), ఇబ్రహీం (మహబూబ్‌నగర్‌), సురేందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), బిల్యానాయక్ (దేవరకొండ), పాల్వాయి శ్రవణ్ (మునుగోడు), రవికుమార్ (తుంగతుర్తి), నెహ్రూనాయక్ (డోర్నకల్), అబ్బయ్య (ఇల్లందు), బాలాజీనాయక్ (ఇల్లందు), ఎడవల్లి కృష్ణ (కొత్తగూడెం) ఉన్నారు.

మొత్తం 19మంది రెబల్‌ అభ్యర్ధులతోపాటు వాళ్లకు మద్దతుగా నిలిచిన ఐదుగురు స్థానిక నేతలను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ హైకమాండ్‌ నిర్ణయం తీసుకోవడంతో ఆ మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది.


 

Similar News