త్వరలో తెలంగాణ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ.. ఉండేదెవరు? పోయేదెవరు?

Update: 2018-01-23 09:17 GMT

త్వరలో తెలంగాణ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ జరగనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. వారం రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చందూలాల్‌, నాయిని, పద్మారావు, లక్ష్మారెడ్డితోపాటు మరొకరికి ఉద్వాసన పలుకుతారనే టాక్‌ వినిపిస్తోంది. ఇక పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్వామిగౌడ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అలాగే ఈసారి కచ్చితంగా కేబినెట్‌లో మహిళలకు చోటు కల్పించేందుకు కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. మహిళా కోటాలో కొండా సురేఖ, రేఖానాయక్‌, కోవా లక్ష్మి పేర్ల పరిశీలిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. స్వామిగౌడ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే నారదాసు లక్ష్మణరావుకు మండలి ఛైర్మన్‌ పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Similar News