కాంగ్రెస్‌లో చేరాలనుకుంటోన్న నాగం జనార్దన్‌కు తెలంగాణ కాంగ్రెస్ నేతల అడ్డంకులు ఎదురవుతున్నాయి. నాగం రాక నచ్చని కొందరు టీకాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దంటూ రాహుల్‌గాంధీకి ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా రాహుల్‌ను కలిసిన ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి బృందం నాగం రాకను వ్యతిరేకిస్తూ కంప్లైంట్ చేశారు. ఇదే విషయంపై ఇప్పటికే కుంతియా, కొప్పుల రాజుకు కూడా ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి బృందం సీనియర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఫిర్యాదుచేశారు. నాగానికి వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదుచేసిన ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి ఎమ్మెల్యే డీకే అరుణ, ఎంపీ నంది ఎల్లయ్య మద్దతు ఇస్తున్నారు.