ఆ దేశంతో చర్చలు ఎలా జరుపుతాం : ఐక్యరాజ్యసమితిలో మంత్రి సుష్మ

Update: 2018-09-30 01:47 GMT

అమెరికాలో 73వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేరాఫ్ అడ్రస్ గా మారిందని.. పాకిస్థాన్ లో టెర్రరిస్టులు స్వేచ్చగా తిరుగుతున్నారని విమర్శించారు. ఉగ్రవాదం పట్ల పాక్ వ్యవహరిస్తున్న తీరు హేయమైనదిగా అభివర్ణించారు. రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అడుగడుగునా ఉల్లంఘిస్తూ.. భారత్ సైనికులను పొట్టన పెట్టుకుంటోందని… ఇటీవల ఇద్దరు ఎస్పీవోలు, ఒక జవాన్ కిడ్నాప్ చేసి కాల్చి చంపారని.. అలాంటి ఆ దేశంతో ఎలా చర్చలు జరుపుతామన్నారు ఆమె తూర్పారబట్టారు.

Similar News