ఆ ఉత్తర్వులను కొట్టేయండి : పరిపూర్ణానంద పిటిషన్

Update: 2018-07-24 02:32 GMT

రాముడిపై కత్తి మహేష్ వ్యాఖ్యలకు నిరసనగా ధర్మాగ్రహ యాత్ర చేపట్టిన స్వామిపరిపూర్ణానందపై హైదరాబాద్ నగర బహిష్కరణ విధించారు పోలీసులు. శాంతిభద్రతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుననట్టు పోలీసులు తెలిపారు. తనపై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు స్వామిజి.నిన్న దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టులో పరిపూర్ణనంద తరపున  మాజీ అడ్వొకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించిగా.. ప్రభుత్వం నుంచి అడిషినల్ ఏజీ రామచందర్ రావు వాదించారు. ఆదిలాబాద్, కరీంనగర్ లో గతంలో స్వామి ఇచ్చిన స్పీచ్ లపై  బహిష్కరించామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పగా.. హైదరాబాద్ పరిధిలో ఎలాంటి కేసులు లేకుండా ఎలా బహిష్కరణ చేస్తారన్న పిటీషనర్ తరపు న్యాయవాది ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్టికల్19 ప్రకారం భారత దేశంలో ఎక్కడైనా జీవించే హక్కు ఉంటుందని కోర్టుకు తెలిపిన స్వామి పరిపూర్ణ నంద తరపు న్యాయవాది. స్వామిజిపై విధించిన  నగర బహిష్కరణ ఎత్తివేయాలని కోరారు. ఇరువాదనలు విన్న హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వం స్వామిజీ  పై జారీ చేసిన డాక్యుమెంట్లను ఇవాళ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.నేడు తదుపరి విచారన జరగనుంది. 

Similar News