గర్భిణిని ఆరుకిలోమీటర్లు మోసుకెళ్ళీ..

Update: 2018-06-09 01:36 GMT

ఇప్పటికి సరైన రోడ్డుమార్గం లేక గ్రామీణ ప్రాంతాలప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అందులో  అడవికి దగ్గరగా ఉండే వాళ్ళ పరిస్థితి అయితే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.. ప్రభత్వాలు ఎన్ని చేసినా వారికీ సరైన రోడ్డు మార్గాలు ఏర్పాటు చేయలేకపోతున్నారు. విశాఖ జిల్లా కోటవురట్ల మండలం గొట్టివాడ పంచాయతీ అణుకు గ్రామానికి చెందిన గమిల లింగో అనే గర్భిణికి శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో 108 వాహనానికి ఫోన్‌ చేశారు. అయితే ఆ ఊరికి సరైన రోడ్డు మార్గంలేదు ఎటు చూసిన అడుగులోతు గుంతలు.. వాటిలో వాననీరు దీంతో 108 అంబులెన్సు రాలేదు. కాసేపటికే  గర్భిణీ మహిళకు పురిటినొప్పులు మరికాస్త ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో  కర్రకు దుప్పటి కట్టి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టివాడకు గర్భిణిని మోసుకెళ్లారు. అక్కడ నుంచి కోటవురట్ల సామాజిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలో తీసుకెళ్లారు. అక్కడ నుంచి రాత్రి 9 గంటలకు నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు

Similar News