విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాలు పెంపు..

Update: 2018-07-31 02:11 GMT

తెలంగాణలోని విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికు (ఆర్టిజన్లు) లకు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు.  ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతమున్న వేతనాలతో పోలిస్తే.. గ్రేడ్‌–1 ఆర్టిజన్లకు రూ.3,477, గ్రేడ్‌–2 ఆర్టిజన్లకు రూ.2,865, గ్రేడ్‌–3 ఆర్టిజన్లకు రూ.2,181, గ్రేడ్‌–4 ఆర్టిజన్లకు రూ.1,900 వేతనం పెరగనుంది. పెరిగిన వేతనాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అంతేకాకుండా  వీరికి ఈఎస్‌ఐ, పీఎఫ్‌ యాజమాన్య వాటాలను ఇకపై యాజమాన్యాలే చెల్లించనున్నాయని పేర్కొంది. కాగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 21 నుంచి విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టిన సంగతి తెలిసిందే. విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సచివాలయంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఆ సందర్భంగా ఆర్టిజన్ల వేతనాల పెంపుతోపాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వాటాల చెల్లింపు తదితర డిమాండ్ల పరిష్కారానికి విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు హామీ ఇవ్వడంతో కార్మిక సంఘాలు సమ్మె విరమించాయి. దీంతో ఇచ్చిన హామీ మేరకు ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు వేతనాలు పెంచుతూ.. ఉత్తర్వులు జారీ చేశారు. 

Similar News