శబరిమలలో హైటెన్షన్‌

Update: 2018-10-17 05:06 GMT

ఇన్నేళ్లుగా భక్తుల నినాదాలతో.. స్వామివారి కీర్తనలతో ప్రతిధ్వనించిన శబరిమల ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా..శబరిమల మొత్తం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.అధ్యాత్మికత కనిపించే చోట.. ఇప్పుడు అందుకు భిన్నంగా శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగే పరిస్థితులు నెలకొన్నాయి.  శతాబ్దాల తరబడి ఉన్న ఆచార వ్యవహారాలు.. నమ్మకాలను పక్కన పెట్టి.. శబరిమల ఆలయంలోకి మహిళల్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో  ఇప్పుడు అందరి దృష్టశబరిమలపై పడింది.

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం  తెరుచుకోనుంది. మాస పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఇవాళ సాయంత్రం నుంచి ఐదు రోజులపాటు తెరుచుకోనుంది. ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో శబరిమల ఏరియాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పైగా ఇప్పటికే ఆలయ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.  పంబా పరిసరాలతో పాటు ఆలయ ప్రాంగణంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో ‘సేవ్ శబరిమల’ ఉద్యమం జరుగుతోంది. మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే, ఆత్మహత్య చేసుకుంటామని కొందరు భక్తులు హెచ్చరించారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ భజన చేస్తూ మహిళలు సహా అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లేందుకు ప్రధాన ద్వారమైన నిలక్కళ్‌ వద్దకు చేరారు. ప్రధాన మార్గానికి చేరుకున్న 13 మంది మహిళలు, ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉండడంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది.

ఆలయ దర్శనానికి వస్తున్న మహిళలను పోలీసులు , ఆందోళనకారులు పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ఆలయానికి వెళ్లే వాహనాలను భక్తులు నిలిపివేశారు. కొండపైకి వెళ్లకుండా మహిళలను అడ్డుకుంటున్నారు. ప్రతి వాహనాన్నీ తనిఖీ చేసి.. వృద్ధులు సహా అన్ని వయసుల మహిళలనూ కిందకు దింపేస్తున్నారు.

సాధారణంగా ఎప్పుడైనా తెలియక నిషేధిత వయస్కులైన మహిళలు ఆలయంలోకి వచ్చినా, ఆలయ సంప్రదాయాలకు సంబంధించి ఇతర ఉల్లంఘనలు జరిగినా ఆలయాన్ని శుద్ధి చేయడం తప్పనిసరి. సుప్రీం తీర్పు ప్రకారం మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తే ప్రతి రోజూ.. రోజులో కూడా వివిధ సందర్భాల్లో పలుమార్లు పుణ్యాహవచనం చేయాల్సి ఉంటుంది. రోజూ ఇలా చేయడం అసాధ్యం. కాబట్టి అలాంటి పరిస్థితే వస్తే గుడిని నిరవధికంగా మూసివేయాలనే ఆలోచనలో ఆలయ ప్రధాన పూజారి రాజకుటుంబం ఉన్నాయని పందళం రాజకుటుంబ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక క్షేతం యుద్ధవాతావరణాన్ని తలపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతోందనన్న టెన్షన్‌ నెలకొంది. సుప్రీం తీర్పుతో మహిళలు స్వామిని దర్శించుకుంటారా లేక ఆలయ సంప్రదాలకు భంగం వాటిల్లకుండా ఆలయాన్నే మూసేస్తారా అనే అనుమానం కలుగుతోంది. 

Similar News