కేరళపై ప్రకృతి కన్నెర్ర, మునిగిన శబరిమల ఆలయం

Update: 2018-08-18 04:38 GMT

ఆగస్టు 8వ తేదీ నుంచి వర్షాలు దంచి కొడుతుండటంతో కేరల జలవిలయంలో చిక్కుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయ్ సహాయక బృందాలు. 2వేల 94 క్యాంపులు ఏర్పాటు చేసి మూడున్నర లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. పతనంతిట్ట, అలప్పూజ, ఎర్నాకులం, త్రిశూర్‌, కొచ్చి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. శుక్రవారం ఒక్క రోజే వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 82వేల మందిని సహాయక బృందాలు రక్షించాయ్.మరోవైపు పంపానది ఉధృతంగా ప్రవహించడం, వివిధ డామ్‌ల నుంచి గేట్లు ఎత్తివేడంతో అయ్యప్పస్వామి ఆలయ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో టెంపుల్‌ని మూసివేశారు. చాలామంది దేవాలయంలో వుండిపోయారు.

Similar News