మిగిలివున్న ఒకేఒక్క ఆదిమానవుడికి రక్షణ కరువు

Update: 2018-07-26 01:59 GMT

ఆదిమజాతి మానవుల్లో మిగిలింది ఒక్కరే.. అతనికి కూడా  అడవిలో రక్షణ లేకుండా పోయింది. స్మగ్లర్లు, ఇతర వ్యక్తులనుంచి ప్రాణబెడద ఏర్పడింది. బ్రెజిల్‌లోని రొండోనియా ప్రాంతంలో నిరంతరం వర్షాలు కురిసే కారడవిలో దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఏకాకిగా జీవిస్తున్న ఆదిమజాతి మనిషిని తొలిసారిగా వీడియోల్లో రికార్డ్‌ చేసింది బీబీసీ. అతని సంబంధీకుల్లోని అందరూ మరణించగా అతనొక్కడే అడవిలో సంచరిస్తూ జీవిస్తున్నాడు. 1980,90 దశకాల్లో రొండోనియా ప్రాంతంలోని రైతులు, అక్రమంగా చెట్లు నరికేవారి దాడుల్లో ఈ వ్యక్తి సంబంధీకులు వేలమంది మంది హత మవ్వడంతో  ఆ తరువాత మిగిలింది ఈ ఆదిమతెగకు చెందినవారు కేవలం ఆరుగురే ఉండేవారు. 1995లో జరిగిన స్మగ్లర్లు దాడిలో ఆరుగురిలో ఐదుమంది హతమయ్యారు. దాంతో మిగిలిన ఆ ఒక్కరే ఈ వ్యక్తిగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఎడడుగుల ఎత్తు,   50 సంవత్సరాల వయసు అతనికి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నాగరిక మనిషికి ఉండాల్సిన  ఆకారం లేకపోవటం, పైగా చెట్లపై ఎగురుతూ దొరికిన జంతువునువేటాడి తినడం వంటి పనులు చేస్తుండటంతో  అతను ఆదిమజాతి తెగకు చెందిన వ్యక్తిగా గుర్తింపుపడ్డాడు   

అక్కడ జంతువుల వేటతో పాటు మొక్కలు, పండ్లచెట్ల పెంపకం ఇతని వ్యాపకం. వేట కోసం గుంతలు, కందకాలు తవ్వేవాడు. నివాసం కోసం వెదురు బొంగులతో ఓ ఇంటిని నిర్మించుకున్నాడు. అయితే ఎవరైనా శత్రువులు అతనిపై దాడికి యత్నిస్తే తన నివాసంలోకి వెళ్లి బాణాలను ప్రయోగించి ప్రమాదం నుంచి తప్పించుకునే ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇదిలావుంటే 1996 లో ‘ఫునాయ్‌’ అనే సంస్థ అతన్ని బయటి ప్రపంచానికి పరిచయం చేయడంకోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అతని జాడకోసం కారడవిలో వెతుకులాట ప్రారంభించిన సమయంలో సంస్థ  సమూహంపై బాణాలతో దాడి చేసినట్టు ఫునాయి ప్రతినిధులు వెల్లడించారు.  ఆ సమయంలో అతడి పెరట్లోని చిన్న తోటలో బొప్పాయి, అరటి చెట్లతో పాటు మొక్కజొన్న పంట వేసినట్టు  ‘ఫునాయ్‌’ ప్రతినిధి వాట్సాన్‌ చెప్పారు.. ఇక స్మగ్లర్లు, వేటగాళ్ల నుంచి అతడికి రక్షణ అవసరమని.. ఎటునుంచి ఏ ఉపద్రవం వస్తుందో అని ఆ వ్యక్తి చెట్లపైనుంచి తొంగిచూస్తున్నట్టు ఆ వీడియోల్లో అర్ధమవుతోంది.

Similar News