మరో దొంగ బాబా బండారం బట్టబయలు

Update: 2017-09-22 11:53 GMT
  • పండంటి పడతులూ వాంఛకు ఫలహారమే
  • ఓ యువతి ఫిర్యాదుతో బయటపడ్డ బండారం
  • రక్తపోటు పెరిగిందంటూ ఆస్పత్రిలో చేరిక

జైపూర్: దేశంలో రోజుకో బాబా బండారం బయుటపడుతోంది. మొన్న ఆశారాం బాపు. నిన్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్... ఇవాళ ఫలహారి బాబా... వీళ్లలో ఎక్కువమంది చెప్పేవి శ్రీరంగనీతులు... చేసేవి తప్పుడు పనులే. వీళ్లలో ఇద్దరు ఇప్పుడు జైళ్లలో ఉన్నారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో స్వయంప్రకటిత ‘ఫలహారి’ బాబా ఈ కోవకు చెందినవాడే. పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు.

కాబట్టి ఈయనకా పేరు వచ్చిందట! ఆ పేరుకు తగినట్టే పండంటి పడతులను కూడా ఫలహారం చేస్తాడన్న వాస్తవం ఒక యువతి సాహసించి పోలీసులకిచ్చిన ఫిర్యాదుతో లోకానికి వెల్లడైంది... అయితే, అస్వస్థత సాకుతో ఆస్పత్రిలో ఉన్న బాబా కోలుకోగానే ప్రశ్నించేందుకు పోలీసులు వేచి చూస్తున్నారు. కౌసలేంద్ర ప్రపన్నాచార్య ఫలహారి మహరాజ్... వయసు 70 సంవత్సరాలు... ఆల్వార్‌లోని విలాసవంతైమెన ఆశ్రమంలో భక్తులకు జ్ఞానబోధ చేస్తుంటాడు. దేశవిదేశాల్లోనూ ఈయునకు భక్తులున్నారు. తరచూ అగ్రశ్రేణి రాజకీయ నాయుకులు, సెలెబ్రిటీలతో ఫొటోల్లో దర్శనమిస్తుంటాడు. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు గాలిస్తుండగా అధిక రక్తపోటుతో ఆల్వార్‌లోని ఆస్పత్రిలో తేలాడు. 

ఆయన తనపై అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు చేసిన యువతి తల్లిదండ్రులు కొన్నేళ్లుగా సదరు బాబాగారి భక్తులు. ఆమె న్యాయుశాస్త్ర పట్టభద్రురాలు కాగా, బాబాగారి సిఫారసు మేరకు ఢిల్లీలో ఓ ప్రముఖ లాయుర్‌వద్ద శిక్షణకు అవకాశం లభించింది. ఆ మేరకు తొలిసారి అందుకున్న శిక్షణ భృతి రూ.3వేలు ఆశ్రమానికి విరాళం ఇవ్వాల్సిందిగా తల్లిదండ్రులు సూచించారు. వారి సలహా ప్రకారం ఆమె ఆగస్టు 7న ఆశ్రమానికి వెళ్లింది. అయితే, ఆ రోజు గ్రహణం ఉన్నందువల్ల బాబా ఎవరినీ కలవబోరని, రాత్రి బసచేసి ఉదయాన్నే దర్శనం చేసుకోవచ్చునని అక్కడివారు చెప్పారు. అయితే, రాత్రివేళ తనవద్దకు పిలిపించుకున్న బాబా తనపై అత్యాచారం చేశాడని, ఎవరిైకెనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడని ఆ యువతి పోలీసులకు చెప్పింది. ఆ తర్వాత బాబా పలుమార్లు ఆమె ఇంటికి వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Similar News